హాయ్......

22, మార్చి 2012, గురువారం

ఉగాది శుభాకాంక్షలు


పరిమళించే తెలుగు మనసులకి....


పులకించే తెలుగు హృదయలకి.....
నామ ఉగాది శుభాకాంక్షలు ....
కొత్త సంవత్సర షడ్రుచులు మీ జీవితంలో సంతోషాన్ని,

ఆయురారోగ్యాన్ని స్మరుద్ధిగా నింపాలని కోరుకుంటూ......


తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎ హే... ఎంటీ మళ్లీ ఈ గోల


ఎందుకు
ఈ మధ్య ఏ ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల అయినా
ఏదో ఒక వివాదం
ప్రతి నోటిఫికేషన్‌పై కోర్టు కెళ్లడం
మద్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం
మిగతా వారు దాన్ని సవాల్ చేయడం
చివరకు ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఆలస్యం కావడం
ఏంటీ.. ఇది
ఎందుకు ఇలా
చీరాకు వస్తుంది

21, మార్చి 2012, బుధవారం

1982 భారతీయ విద్యా కమిషన్


ఈ కమిషన్‌ను హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం ఉడ్స్ డిస్పాచ్ సిఫార్సుల అమలు తీరును పర్యవేక్షించి నూతన విద్యా విధానాన్ని సిఫార్సు చేయడం. ఈ కమిషన్‌ను అనుసరించి స్వదేశీ విద్యా సంస్థలను ప్రోత్సాహించడం, ఎలిమెంటరీ స్కూళ్లను ఏర్పాటు చేయడం, మాతృబాషలోనే బోధన చేయడం, జిల్లా,మున్సిపల్ బోర్డులను ఏర్పాటు చేయడం, ప్రాథమిక పాఠశాల కనీస అవసరాల బాధ్యతలను ఈ విద్యా బోర్డుల తీసుకోవడం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు సంస్థలకు,మిషనరీలకు అప్పగించాలి

ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి పెరుగుతున్న పోటీ


ప్రపంచ బ్యాంకులకు పెద్దన్న ... ప్రపంచ దేశాలకు రుణదాత.. వరల్డ్ బ్యాంకు .. దేశంలో కొన్ని బ్యాంకుల పేరు తెలియని వారు ఉండొచ్చు ఏమో కానీ... వరల్డ్ బ్యాంకు గురించి తెలియని వారు ఉండరు.. వరల్డ్ బ్యాంకు అన్నా.. వరల్డ్ బ్యాంకు అప్పుల గురించి అన్నా.. అందరి ఎంతో కొంత అవగాహనే ఉండి ఉంటుంది.. అయితే అప్పుల విషయంలో ఎప్పుడు వార్తల్లో ఉండే వరల్డ్ బ్యాంకు ఈ సారి ఓ కొత్త విషయంతో వార్తల్లో నానుతుంది.. అది ఏంటంటే వరల్డ్ బ్యాంకుకు కొత్త అధ్యక్షుడు ఎవరు అని...ప్రస్తుతం దీనికి రాబర్ట్ జులోవిక్ ప్రెసిడెంట్.. ఈయన పదవీకాలం జూన్ 30న ముగుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ... ప్రపంచ దేశాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది...అయితే ఒకరి పదవీ కాలం ముగిస్తే మరోకరు అధ్యక్షడుగా వస్తారు.. ప్రతిసారి జరిగే తంతే ఇది.. ఇన్నేళ్లు అలానే జరిగింది. కాకపోతే ఈ సారే ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది .. అంటే సాధారణంగా వరల్డ్ బ్యాంకు అధ్యక్షడు ఎప్పుడు అమెరికాకు చెందిన వారే ఉంటారు..అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అధ్యక్షుడు యూరోపియన్ ఉంటే. ... ప్రపంచబ్యాంకుకు అధ్యక్షుడు అమెరికన్ ఉంటారు.. అలాంటి రూల్ ఏం లేకపోయినా ఇదోక అచారంగా వస్తోంది. దీంతో రాబర్ట్ వారసుడు కూడా అమెరికా నుంచే ఉండాలని ఆ దేశం అభిప్రాయపడుతోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇంతుకుముందులా అమెరికా క్యాండిడేట్‌ను ఎకగ్రీవంగా ఎన్నుకునే వాతావరణం మారిపోయింది. మేం ఎందుకు వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు కాకకూడదు మిగతా సభ్య దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఈ సారి పోటీ దిగుతామని ప్రకటిస్తున్నాయి.అయితే మిగతా దేశాల నుంచి ఈ పదవి కోసం పోటీ పెరుగుతున్నప్పటికీ అమెరికన్లు తమకే పదవి అన్నట్లు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ రాబర్ట్ తరువాత ఆ పదవిపై గత అధ్యక్ష ఎన్నికల్లో పోరాడి ఓడినా హిల్లరీ క్లింటన్ కన్నేశారు. వరల్డ్ బ్యాంకు చీఫ్ పదవి చేపట్టడానికి ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అమెరికన్ సిటిజన్ కావడం అతి పెద్ద క్వాలిఫికేషన్‌గా ఫీలవుతున్నారు. దీనికి తోడు సాంప్రదాయంగా అమెరికన్లే ఈ పదవి చేపట్టుతుండడంతో ఆ పద్దతి ప్రకారం నెక్ట్స్ ప్రెసిడెంట్ నేనని హిల్లరీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని ఓ మహిళ చేపట్టలేదు. తాజాగా ఐఎమ్ఎఫ్‌ అధ్యక్ష పదవిని మహిళాకు కట్టబెట్టారు. కాబట్టి అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించాలని హిల్లరీ వాదిస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా ఒబామా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హిల్లరీ .. ప్రపంచ బ్యాంకు పనులకు చక్కబెట్టగలదని అమె మద్దతుదారులు చెబుతున్నారుఅయితే అమెరికాకే చెందిన లారెన్స్ సమ్మర్స్ వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆర్థిక రంగంలో విశేషానుభం అనుభవం ఉన్న లారెన్స్ 1990 లో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఎకానమిస్ట్‌గా పనిచేశారు... అనేక అంతర్జాతీయ సంస్థల్లో కూడా పనిచేశారు. దీంతో ఈ సారి ఆయన వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు పోటీలో దిగుతున్నారు.ఇక ప్రస్తుతం అమెరికా ట్రెజరీ సెక్రటరీగా ఉన్న తిమోతీ గీత్నర్ కూడా వరల్డ్ బ్యాంకు పోటీలో ఉన్నారు. ఈయనతో పాటు ప్రపంచ బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన రాబర్ట్ రూబిన్, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్ లు ప్రపంచ బ్యాంకు అధినేత పదవి కోసం పోటీ పడుతున్నారు.అయితే అమెరికన్లలోనే ఇంతమంది పోటీలో ఉండగా మిగతా దేశాలకు చెందిన వారు కూడా తమ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ మహ్మద్ ఎల్ ఎరిన్, బంగ్లాదేశ్ నోబల్ విజేత మహ్మద్ యూనస్, సిటిగ్రూప్ ఛైర్మన్ విక్రమ్ పండిట్, పెప్సీ కో ఛైర్మన్ ఇంద్రా నూయిలు కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇండియా విషయానికోస్తే ఇప్పటికే కొందరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఈ జాబితాలో ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహూవాల్లియా , యుఐడి ఛైర్మన్ నందన్ నీలకనీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఉన్నారని సమచారం
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతుండడంతో మిగతా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సభ్య దేశాల మద్య రాజీకి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా దేశాలకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఐఎమ్ఎప్ అధ్యక్షురాలు క్రిస్టినా లగార్డే, వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జులోవిక్ భారత పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో భారత్‌కు 2.91 ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అయితే వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవి కోసం ఉన్న పోటీపై అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేేసే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అర్హత జాతీయత కాదని , సామర్థ్యం మాత్రమేనని అంటున్నారు.

చదువుతున్నాను


1989 లో నేను చదవడం ప్రారంభించాను
అలా 2006 వరకు చదువుతూనే ఉన్నాను
తరువాత ఉద్యోగం
మళ్లీ ఇప్పుడు
చదువుతున్నాను
అందుకే ఈ కొత్త పోస్టింగ్‌లు

1854 ఉడ్స్ డిస్పాచ్


ఈనాటి భారతీయ విద్యా విదానానికి పునాదులు నిర్మించింది ఉడ్స్ డిస్పాచ్
ఉడ్స్ నివేదికలోని చాలా అంశాలను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోలేదు
ఉడ్స్ నివేదికతో విద్యా శాఖ, విద్యా తనిఖీ విభాగాలు ఏర్పడ్డాయి.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ పేరుతో విద్యా సంస్థలకు నిధులను అందించే వ్యవస్థ ప్రారంభం అయింది
మూడు విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది

లార్డ్ మెకాలె నివేదిక


1834లో లండన్ నుంచి మన దేశానికి వచ్చిన లార్డ్ మెకాలె విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాడు
1835,ఫిబ్రవరి 2న బ్రిటిషు కౌన్సిల్ భారతీయ విద్యారంగంపై తన నివేదికను సమర్పించాడు
దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అందించే నిధులు కేవలం ఆంగ్ల భాషాభివృద్ధికి మాత్రమే కేటాయించాలి
దేశీయ విద్యా సంస్థలను మూసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సాహించాలి
ఈ నివేదిక ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమైయ్యాయి
పాఠశాల తనిఖీ కోసం ఒక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటయింది