హాయ్......

29, మార్చి 2012, గురువారం




ఒకప్పుడు డబ్బు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ లో నిలబడి ఉండాల్సి వచ్చేది. ఆ తరువాత ఏటీఎంల రాకతో అంతా మారిపోయింది. బ్యాంకుకు వెళ్లకుండానే ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఏటీఎంలతోనూ కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి ఏటీఎం కార్డును మనం మర్చిపోవడం, మరోసారి డబ్బులు సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు వినియోగదారులను వేధిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా , అసలు ఏటీఎం కార్డుతో పని లేకుండా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా.. అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది సింగపూర్‌కు చెందిన యునైటెడ్ ఓవర్‌సీస్ బ్యాంకు
కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ ఓ అప్లికేషన్‌ని రూపొందించింది. ఈ అప్లికేషన్ వల్ల ఏటిఎమ్ కార్డు లేకుండానే డబ్బుని ట్రాన్పర్ లేదా విత్ డ్రా చేయవచ్చు. ఈ అప్లికేషన్‌‌కి మనీ క్యాష్ అనే పేరు పెట్టింది. ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారు లిస్ట్‌లో యాడ్ చేసుకున్న కస్టమర్స్‌కి డబ్బుని ట్రాన్ఫర్ చేయవచ్చు. మనీ పంపాల్సిన కస్టమర్‌కి టెక్ట్స్ మేసేజ్ ద్వారా యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ అందించే పాస్ వర్డ్‌ని పంపితే చాలు మొత్తం సింగపూర్‌లో ఉన్న 600 ఏటియమ్ సెంటర్లలలో డబ్బుని డ్రా చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సింగపూర్‌లో ఉన్న యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద తెలుసుకొవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా కస్టమర్స్ ఫండ్ ట్రాన్పర్స్, పే బిల్స్, ఎకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడం కూడా చేయవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్‌లో బంగారం, వెండి ధరలను కూడా కస్టమర్స్‌కి తెలుసుకోవచ్చు.ప్రస్తుతానికి ఈ అప్లికేషన్‌ని ఆపిల్ స్మార్ట్ ఫోన్స్‌లో నిక్షిప్తం చేసేందుకు గాను బ్యాంకు ఆపిల్ స్టోర్స్‌లలో ఫ్రీగా అందిస్తుంది. వచ్చే సంవత్సరంలో ఈ అప్లికేషన్‌ని బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కి అందించేందుకు సన్నాహాలు చేస్తుంది.ప్రపంచంలో ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సింగపూర్ బ్యాంక్ యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి