హాయ్......
-
1834లో లండన్ నుంచి మన దేశానికి వచ్చిన లార్డ్ మెకాలె విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాడు 1835,ఫిబ్రవరి 2న బ్రిటిషు కౌన్సిల్ భారతీయ విద్యారంగంపై ...
-
భారతదేశంలో పాఠశాల, విద్యకు ఉన్న చరిత్రను తెలుసుకునే భాగంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాల్లో ఆడమ్స్ నివేదిక ఒకటి. స్వాతంత్ర పూర్వం ఉన్న విద్...
-
అవును మారిపోయాను. ఎప్పుడో బ్లాగు క్రియేట్ చేసి కూడా ఇప్పటికీ కానీ నాకు గుర్తు రాలేదు. ఈ విషయంలో నేను హర్షిణికి థ్యాంక్స్ చెప్పుకోవాలి , ఎందు...
-
ఫైథాగరస్ గొప్ప గణిత శాస్త్రవేత్త.సామోస్ ద్వీప వాసి. థేల్స్ శిష్యుడు. పాఠశాల స్థాపనకు తన దేశం అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలోని క్రాటన్‌లో...
-
ఆధునిక గణితం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి అధారమైన సమితి వాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచిన జార్జి కాంటర్ రష్యాలోని సెయింట్ పీటర్స...
-
ప్రపంచ బ్యాంకులకు పెద్దన్న ... ప్రపంచ దేశాలకు రుణదాత.. వరల్డ్ బ్యాంకు .. దేశంలో కొన్ని బ్యాంకుల పేరు తెలియని వారు ఉండొచ్చు ఏమో కానీ... వరల్...
-
ఈనాటి భారతీయ విద్యా విదానానికి పునాదులు నిర్మించింది ఉడ్స్ డిస్పాచ్ ఉడ్స్ నివేదికలోని చాలా అంశాలను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఉ...
-
పరిమళించే తెలుగు మనసులకి.... పులకించే తెలుగు హృదయలకి..... నామ ఉగాది శుభాకాంక్షలు .... కొత్త సంవత్సర షడ్రుచులు మీ జీవితంలో సంతోషాన్ని, ఆయురా...
21, మార్చి 2012, బుధవారం
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి పెరుగుతున్న పోటీ
ప్రపంచ బ్యాంకులకు పెద్దన్న ... ప్రపంచ దేశాలకు రుణదాత.. వరల్డ్ బ్యాంకు .. దేశంలో కొన్ని బ్యాంకుల పేరు తెలియని వారు ఉండొచ్చు ఏమో కానీ... వరల్డ్ బ్యాంకు గురించి తెలియని వారు ఉండరు.. వరల్డ్ బ్యాంకు అన్నా.. వరల్డ్ బ్యాంకు అప్పుల గురించి అన్నా.. అందరి ఎంతో కొంత అవగాహనే ఉండి ఉంటుంది.. అయితే అప్పుల విషయంలో ఎప్పుడు వార్తల్లో ఉండే వరల్డ్ బ్యాంకు ఈ సారి ఓ కొత్త విషయంతో వార్తల్లో నానుతుంది.. అది ఏంటంటే వరల్డ్ బ్యాంకుకు కొత్త అధ్యక్షుడు ఎవరు అని...ప్రస్తుతం దీనికి రాబర్ట్ జులోవిక్ ప్రెసిడెంట్.. ఈయన పదవీకాలం జూన్ 30న ముగుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ... ప్రపంచ దేశాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది...అయితే ఒకరి పదవీ కాలం ముగిస్తే మరోకరు అధ్యక్షడుగా వస్తారు.. ప్రతిసారి జరిగే తంతే ఇది.. ఇన్నేళ్లు అలానే జరిగింది. కాకపోతే ఈ సారే ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది .. అంటే సాధారణంగా వరల్డ్ బ్యాంకు అధ్యక్షడు ఎప్పుడు అమెరికాకు చెందిన వారే ఉంటారు..అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అధ్యక్షుడు యూరోపియన్ ఉంటే. ... ప్రపంచబ్యాంకుకు అధ్యక్షుడు అమెరికన్ ఉంటారు.. అలాంటి రూల్ ఏం లేకపోయినా ఇదోక అచారంగా వస్తోంది. దీంతో రాబర్ట్ వారసుడు కూడా అమెరికా నుంచే ఉండాలని ఆ దేశం అభిప్రాయపడుతోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇంతుకుముందులా అమెరికా క్యాండిడేట్‌ను ఎకగ్రీవంగా ఎన్నుకునే వాతావరణం మారిపోయింది. మేం ఎందుకు వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు కాకకూడదు మిగతా సభ్య దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఈ సారి పోటీ దిగుతామని ప్రకటిస్తున్నాయి.అయితే మిగతా దేశాల నుంచి ఈ పదవి కోసం పోటీ పెరుగుతున్నప్పటికీ అమెరికన్లు తమకే పదవి అన్నట్లు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ రాబర్ట్ తరువాత ఆ పదవిపై గత అధ్యక్ష ఎన్నికల్లో పోరాడి ఓడినా హిల్లరీ క్లింటన్ కన్నేశారు. వరల్డ్ బ్యాంకు చీఫ్ పదవి చేపట్టడానికి ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అమెరికన్ సిటిజన్ కావడం అతి పెద్ద క్వాలిఫికేషన్‌గా ఫీలవుతున్నారు. దీనికి తోడు సాంప్రదాయంగా అమెరికన్లే ఈ పదవి చేపట్టుతుండడంతో ఆ పద్దతి ప్రకారం నెక్ట్స్ ప్రెసిడెంట్ నేనని హిల్లరీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని ఓ మహిళ చేపట్టలేదు. తాజాగా ఐఎమ్ఎఫ్ అధ్యక్ష పదవిని మహిళాకు కట్టబెట్టారు. కాబట్టి అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించాలని హిల్లరీ వాదిస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా ఒబామా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హిల్లరీ .. ప్రపంచ బ్యాంకు పనులకు చక్కబెట్టగలదని అమె మద్దతుదారులు చెబుతున్నారుఅయితే అమెరికాకే చెందిన లారెన్స్ సమ్మర్స్ వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆర్థిక రంగంలో విశేషానుభం అనుభవం ఉన్న లారెన్స్ 1990 లో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఎకానమిస్ట్‌గా పనిచేశారు... అనేక అంతర్జాతీయ సంస్థల్లో కూడా పనిచేశారు. దీంతో ఈ సారి ఆయన వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు పోటీలో దిగుతున్నారు.ఇక ప్రస్తుతం అమెరికా ట్రెజరీ సెక్రటరీగా ఉన్న తిమోతీ గీత్నర్ కూడా వరల్డ్ బ్యాంకు పోటీలో ఉన్నారు. ఈయనతో పాటు ప్రపంచ బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన రాబర్ట్ రూబిన్, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్ లు ప్రపంచ బ్యాంకు అధినేత పదవి కోసం పోటీ పడుతున్నారు.అయితే అమెరికన్లలోనే ఇంతమంది పోటీలో ఉండగా మిగతా దేశాలకు చెందిన వారు కూడా తమ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ మహ్మద్ ఎల్ ఎరిన్, బంగ్లాదేశ్ నోబల్ విజేత మహ్మద్ యూనస్, సిటిగ్రూప్ ఛైర్మన్ విక్రమ్ పండిట్, పెప్సీ కో ఛైర్మన్ ఇంద్రా నూయిలు కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇండియా విషయానికోస్తే ఇప్పటికే కొందరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఈ జాబితాలో ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహూవాల్లియా , యుఐడి ఛైర్మన్ నందన్ నీలకనీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఉన్నారని సమచారం
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతుండడంతో మిగతా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సభ్య దేశాల మద్య రాజీకి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా దేశాలకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఐఎమ్ఎప్ అధ్యక్షురాలు క్రిస్టినా లగార్డే, వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జులోవిక్ భారత పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో భారత్‌కు 2.91 ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అయితే వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవి కోసం ఉన్న పోటీపై అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేేసే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అర్హత జాతీయత కాదని , సామర్థ్యం మాత్రమేనని అంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి