
బ్యాంకు ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన చెక్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సవరించింది.చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టుల చెల్లుబాటు వ్యవధిని మూడునెలలకి తగ్గించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇప్పటిదాకా చెక్కులు, డ్రాఫ్ట్‌లు, పేఆర్డర్లు, బ్యాం కర్స్ చెక్కులకు ఆరునెలల కాలపరిమితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది వీటిని ఆరునెల్లపాటు నగదు మాదిరిగా చెలామణి చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆర్థిక శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. బంగారం, బాండ్స్ లాగా చెక్, డిడిలను కొంతమంది తమవద్ద కుదువబెట్టుకుని దానికి అధిక వడ్డీ రేట్లకు డబ్బులివ్వడం జరుగుతోంది.ఈ నేపధ్యంలో ప్రజాప్రయోజనాలు, బ్యాంకింగ్ పాలసీ ప్రయోజనాల దృష్ట్యా చెక్కు లు, ఢ్రాఫ్టులు, పేఆర్డర్లు, బ్యాంకర్ల చెక్కుల చెల్లుబాటు కాలాన్ని మూడు నెలలకి తగ్గించడం అనివార్యమైందని ఆర్‌బిఐ వెల్లడించింది.. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ని కూడా పంపించింది. చెక్, డిడి, పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్ లాంటివి మంజూరు చేసిన 3 నెలల తర్వాత డ్రా చేసుకోవడానికి వస్తే డబ్బు ఇవ్వరాదనీ పేర్కోంది . ఇక చెక్కులు, ఢ్రాఫ్టుల కాలపరిమితి తగ్గింపును సానుకూల చర్యగా బ్యాంకింగ్ వర్గాలు పేర్కోన్నాయి. మరో పక్క ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాకర్ తీసుకునే విషయంలో ఉన్న నిబంధనలను కూడా ఆర్‌బిఐ సవరించింది.ఎఫ్‌డి చేసేవారు, లాకర్ తీసుకునేవారు సంతకాలు చేస్తే ప్రత్యక్షంగా సాక్ష్యుల ధృవీకరణ అవసరం లేదని వెల్లడించింది. అయితే వేలిముద్ర వారి విషయంలో మాత్రం కచ్చితంగా ఇద్దరు సాక్ష్యుల ధృవీకరణ తీసుకోవాలని పేర్కోంది. అకౌంట్ హోల్డర్లకు కూడా సంతకాల ధృవీకరణ అవసరం లేదని తెలిపింది. ఎఫ్‌డిలు చేసేవారు, లాకర్లు తీసుకునే వారు కచ్చితంగా సంతకాల ధృవీకరణ సమర్పించాలని బ్యాంకులు పట్టుబడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి