హాయ్......

29, మార్చి 2012, గురువారం

Pythagoras of Samos 570 - 500 BC



ఫైథాగరస్ గొప్ప గణిత శాస్త్రవేత్త.సామోస్ ద్వీప వాసి. థేల్స్ శిష్యుడు. పాఠశాల స్థాపనకు తన దేశం అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలోని క్రాటన్‌లో స్థిరపడ్డారు. ఫైథాగరీయన్ పాఠశాల ప్రారంభించారు.ఈ అకాడమీ చిహ్నం ఐదు శీర్షాల నక్షత్రం. మాథమెటిక్స్ పదప్రయోగం. సంఖ్యావాదం అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం. సంఖ్యలను బేసి, సరి సంఖ్యలుగా వర్గీకరణ, ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల బేధమని చూపడం, వర్గ సంఖ్యల పరిచయం,ఒకటి నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడూ ఒక కచ్చితమైన వర్గం అవుతందనే ఫలితం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందనే నిరూపణ.ఘనాలలో గోళం, సమతలాలలో వృత్తం అందమైనవనే భావనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి