హాయ్......

21, మార్చి 2012, బుధవారం

ఆడమ్స్ నివేదిక


భారతదేశంలో పాఠశాల, విద్యకు ఉన్న చరిత్రను తెలుసుకునే భాగంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాల్లో ఆడమ్స్ నివేదిక ఒకటి. స్వాతంత్ర పూర్వం ఉన్న విద్యా పరిస్థితుల మీద ఆడమ్స్ నివేదికను రూపోందించారు.
దీని ప్రకారం బెంగాల్లో స్వదేశీ విద్యాసంస్థలు ఉండేవి.
బెంగాల్లో సమాంతరంగా మక్తబ్‌లు, స్వదేశీ విద్యాసంస్థలు నడిచేవి.
ఆ కాలంలో గురువులకు ఇచ్చే భృతి చాలా తక్కువగా ఉండేది
ఆగ్రాలోని పర్షియన్ పాఠశాలలో ఉర్దూ, గణితం ,చదవడం రాయడం నేర్పరని తెలుస్తోంది.
ఈస్టిండియా ఆధ్వర్యంలో
1715లో మద్రాస్‌లో...
1718లో ముంబాయిలో ...
1731లో కోల్‌కత్తాలో ఆ తరువాత తంజావూరు, కాన్పూర్‌లలో ఆంగ్లే‍యుల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసింది
విద్యావ్యాప్తి కోసం అప్పటి ప్రభుత్వం మిషనరీ సంస్థలకు అవకాశం కల్పించింది
జర్మనీకి చెందిన స్కావర‌్జ్ మద్రాస్ ప్రావిన్స్‌లో స్వదేశీ విద్య కోసం పాఠశాలలను ప్రారంభించారు
ఆ తరువాత స్కావర్జ్ స్థానంలో వచ్చిన జాన్ సులివాన్ ఈ పాఠశాల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారు
1786లో కాంపెబెల్ ఆనాథ స్రీల కోసం మద్రాస్‌లో ఒక పాఠశాలను ప్రారంభించి మారటోరియల్ పద్ధతిలో విద్యా బోధన జరిపించారు
1719లో బీద యూరోపియన్ ప్రోటెస్టెంట్ పిల్లల కోసం బొంబాయిలో ఒక పాఠశాలను ప్రారంభించారు
1781లో కలకత్తాలో మదరసా ప్రారంభించారు
1791లో కాశీలో సంస్కృత పాఠశాల, కలకత్తాలో పోర్డ్ విలియం కాలేజీలను ఈస్టిండియా కంపెనీ స్థాపించింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి