హాయ్......

29, మార్చి 2012, గురువారం

Georg Ferdinand Ludwig Philipp Cantor



ఆధునిక గణితం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి అధారమైన సమితి వాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచిన జార్జి కాంటర్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జన్మించాడు.బెర్లిన్ యూనివర్సిటీ నుంచి 1867లో డాక్టరేట్ పట్టా పొది హాలే యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించాడు. inifinity కి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు. థియరీ ఆఫ్ ఇన్‌పైనట్ సెట్ అనే సంచలన గ్రంథాన్ని రాశాడు. అధునిక గణిత బాషకు ఆద్యుడు.

  1. A SET IS A FORM OF A POSSIBLE THOUGHT

సమితివాదం, ట్రాన్స్‌పైనట్ నంబర్స్ సిద్ధాంతాల్లో విశేష కృషిని కనబర్చాడు. కాంటర్ సమితివాదలను ఆక్టామాథమెటికా పత్రికా ప్రచురించింది.1904లో రాయల్ సొసైటి సిల్వెష్టర్ మెడల్, 1912లో సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీ డాక్టర్ హాల్ ఆఫ్ పురస్కారాలు లభించాయి.

THE ESSENCE OF MATHEMATICS LIES IN ITS FREEDOM















అయితే ఎన్నో ఆవిష్కరణలను చేసిన కాంటర్ ... వాటిని జనాలు నమ్మకపోకపోవడంతో డిప్రెషన్‌లోకి పోయి .. మెంటల్ హాస్పిటల్ లో మరణించాడు

Pythagoras' Theorem




If the triangle had a right angle (90°) ...

... and you made a square on each of the three sides, then ...

... the biggest square had the exact same area as the other two squares put together!

Pythagoras of Samos 570 - 500 BC



ఫైథాగరస్ గొప్ప గణిత శాస్త్రవేత్త.సామోస్ ద్వీప వాసి. థేల్స్ శిష్యుడు. పాఠశాల స్థాపనకు తన దేశం అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలోని క్రాటన్‌లో స్థిరపడ్డారు. ఫైథాగరీయన్ పాఠశాల ప్రారంభించారు.ఈ అకాడమీ చిహ్నం ఐదు శీర్షాల నక్షత్రం. మాథమెటిక్స్ పదప్రయోగం. సంఖ్యావాదం అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం. సంఖ్యలను బేసి, సరి సంఖ్యలుగా వర్గీకరణ, ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల బేధమని చూపడం, వర్గ సంఖ్యల పరిచయం,ఒకటి నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడూ ఒక కచ్చితమైన వర్గం అవుతందనే ఫలితం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందనే నిరూపణ.ఘనాలలో గోళం, సమతలాలలో వృత్తం అందమైనవనే భావనలు.

అక్రమాలకు 'చెక్'


బ్యాంకు ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన చెక్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సవరించింది.చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టుల చెల్లుబాటు వ్యవధిని మూడునెలలకి తగ్గించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇప్పటిదాకా చెక్కులు, డ్రాఫ్ట్‌లు, పేఆర్డర్లు, బ్యాం కర్స్ చెక్కులకు ఆరునెలల కాలపరిమితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది వీటిని ఆరునెల్లపాటు నగదు మాదిరిగా చెలామణి చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆర్థిక శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. బంగారం, బాండ్స్ లాగా చెక్, డిడిలను కొంతమంది తమవద్ద కుదువబెట్టుకుని దానికి అధిక వడ్డీ రేట్లకు డబ్బులివ్వడం జరుగుతోంది.ఈ నేపధ్యంలో ప్రజాప్రయోజనాలు, బ్యాంకింగ్ పాలసీ ప్రయోజనాల దృష్ట్యా చెక్కు లు, ఢ్రాఫ్టులు, పేఆర్డర్లు, బ్యాంకర్ల చెక్కుల చెల్లుబాటు కాలాన్ని మూడు నెలలకి తగ్గించడం అనివార్యమైందని ఆర్‌బిఐ వెల్లడించింది.. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ని కూడా పంపించింది. చెక్, డిడి, పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్ లాంటివి మంజూరు చేసిన 3 నెలల తర్వాత డ్రా చేసుకోవడానికి వస్తే డబ్బు ఇవ్వరాదనీ పేర్కోంది . ఇక చెక్కులు, ఢ్రాఫ్టుల కాలపరిమితి తగ్గింపును సానుకూల చర్యగా బ్యాంకింగ్ వర్గాలు పేర్కోన్నాయి. మరో పక్క ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాకర్ తీసుకునే విషయంలో ఉన్న నిబంధనలను కూడా ఆర్‌బిఐ సవరించింది.ఎఫ్‌డి చేసేవారు, లాకర్‌ తీసుకునేవారు సంతకాలు చేస్తే ప్రత్యక్షంగా సాక్ష్యుల ధృవీకరణ అవసరం లేదని వెల్లడించింది. అయితే వేలిముద్ర వారి విషయంలో మాత్రం కచ్చితంగా ఇద్దరు సాక్ష్యుల ధృవీకరణ తీసుకోవాలని పేర్కోంది. అకౌంట్ హోల్డర్లకు కూడా సంతకాల ధృవీకరణ అవసరం లేదని తెలిపింది. ఎఫ్‌డిలు చేసేవారు, లాకర్లు తీసుకునే వారు కచ్చితంగా సంతకాల ధృవీకరణ సమర్పించాలని బ్యాంకులు పట్టుబడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



ఒకప్పుడు డబ్బు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ లో నిలబడి ఉండాల్సి వచ్చేది. ఆ తరువాత ఏటీఎంల రాకతో అంతా మారిపోయింది. బ్యాంకుకు వెళ్లకుండానే ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఏటీఎంలతోనూ కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి ఏటీఎం కార్డును మనం మర్చిపోవడం, మరోసారి డబ్బులు సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు వినియోగదారులను వేధిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా , అసలు ఏటీఎం కార్డుతో పని లేకుండా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా.. అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది సింగపూర్‌కు చెందిన యునైటెడ్ ఓవర్‌సీస్ బ్యాంకు
కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ ఓ అప్లికేషన్‌ని రూపొందించింది. ఈ అప్లికేషన్ వల్ల ఏటిఎమ్ కార్డు లేకుండానే డబ్బుని ట్రాన్పర్ లేదా విత్ డ్రా చేయవచ్చు. ఈ అప్లికేషన్‌‌కి మనీ క్యాష్ అనే పేరు పెట్టింది. ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారు లిస్ట్‌లో యాడ్ చేసుకున్న కస్టమర్స్‌కి డబ్బుని ట్రాన్ఫర్ చేయవచ్చు. మనీ పంపాల్సిన కస్టమర్‌కి టెక్ట్స్ మేసేజ్ ద్వారా యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ అందించే పాస్ వర్డ్‌ని పంపితే చాలు మొత్తం సింగపూర్‌లో ఉన్న 600 ఏటియమ్ సెంటర్లలలో డబ్బుని డ్రా చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సింగపూర్‌లో ఉన్న యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద తెలుసుకొవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా కస్టమర్స్ ఫండ్ ట్రాన్పర్స్, పే బిల్స్, ఎకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడం కూడా చేయవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్‌లో బంగారం, వెండి ధరలను కూడా కస్టమర్స్‌కి తెలుసుకోవచ్చు.ప్రస్తుతానికి ఈ అప్లికేషన్‌ని ఆపిల్ స్మార్ట్ ఫోన్స్‌లో నిక్షిప్తం చేసేందుకు గాను బ్యాంకు ఆపిల్ స్టోర్స్‌లలో ఫ్రీగా అందిస్తుంది. వచ్చే సంవత్సరంలో ఈ అప్లికేషన్‌ని బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కి అందించేందుకు సన్నాహాలు చేస్తుంది.ప్రపంచంలో ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సింగపూర్ బ్యాంక్ యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

22, మార్చి 2012, గురువారం


సోషల్ డెవలప్‌మెంట్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. మనిషి ఒంటరిగా బతకలేడు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి కడుపులోని పరిసరాలతో, బయటకు వచ్చక కుటుంబ సభ్యులతో, పెద్దయ్యాక బయటవారితో సాంఘిక వికాసాన్ని జరుపుతాడు. సాంఘిక వికాసాన్ని అనువంశిత, సంస్కృతి, భాష, మానసిక వికాసం, ఆర్థిక పరిస్థితులు,వ్యక్తిగతం, సాంఘిక సంస్థలు, పాఠశాల, ఇరుగు పొరుగు, సమ వయస్కులు ప్రభావవితం చేస్తారు.
సాంఘిక వికాసాన్ని చాలా మంది తత్వవేత్తలు నిర్వంచిచారు. అందులో కొన్ని
స్వయంగాను, ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికారం- సొరెన్ సన్
సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం- హర్లాక్

హ్యాపీ ఉగాది


తెలుగు వారికి..
తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు